Ashish Vidyarthi: మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. రూపాలి బారువాతో రిజిస్టర్ మ్యారేజి
పాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేసే బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన మహిళా వ్యాపారవేత్త రూపాలి బారువా వివాహమాడారు. వీరిది రిజిస్టర్ మ్యారేజి.
Newdelhi, May 26: పాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేసే బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) మళ్లీ పెళ్లి (Marriage) చేసుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన మహిళా వ్యాపారవేత్త (Women Entrepreneur) రూపాలి బారువా (Rupali Baruva) వివాహమాడారు. వీరిది రిజిస్టర్ మ్యారేజి. కోల్ కతాలోని ఓ ఫ్యాషన్ స్టోర్ వ్యాపారంలో రూపాలి భాగస్వామి అని తెలుస్తోంది. ఆశిష్ విద్యార్థి, రూపాలి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిచింది. ఆశిష్ విద్యార్థికి 20 ఏండ్ల కిందట నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి దాంపత్యంలో కలతలు రావడంతో విడిపోయారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)