 
                                                                 Newyork, May 26: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు (American President) జో బైడెన్ (Joe Biden) తెలుగు యువకుడు సాయివర్షిత్ (Saivarshith) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బైడెన్ ను చంపుతానంటూ వైట్‌హౌస్ (Whitehouse) పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన సాయివర్షిత్‌కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ వెల్లడించారు. బుధవారం ఆరెంజ్ రంగు జైలు దుస్తుల్లో కోర్టుకు హాజరైన సాయివర్షిత్, న్యాయమూర్తి అడిగిన సమాధానాలకు వినయంగా క్లుప్తంగా సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఈ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటూ రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి సాయివర్షిత్‌కు వివరించారు. మే 30 దాకా కస్టడీ విధించారు.
అసలేం జరిగింది?
సాయివర్షిత్ మిసోరీ రాష్ట్రంలో నివసిస్తుంటాడు. అతడు గతంలో డేటా అనలిస్ట్‌గా పనిచేశాడు. సోమవారం రాత్రి అతడు ఓ భారీ ట్రక్ నడుపుతూ శ్వేత సౌధం పరిసరాల్లోకి దూసుకొచ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతడి ట్రక్‌లో జర్మనీ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయివర్షిత్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిందితుడిపై ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అధ్యక్షుడిని చంపుతానని బెదిరించడం, అనుమతి లేకుండా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తదితర అభియోగాలను మోపారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
