Mohan Babu Apologize: ఆ జర్నలిస్టుకు క్షమాపణలు చెబుతున్నా.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. మోహన్ బాబు లేఖ

తన నివాసం వద్ద టీవీ9 రిపోర్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి సదరు జర్నలిస్టుకు నటుడు మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పారు.

Mohan Babu expressed his anger on the media

Hyderabad, Dec 13: తన  నివాసం వద్ద టీవీ9 (TV9) రిపోర్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి సదరు జర్నలిస్టుకు నటుడు మోహన్‌ బాబు (Mohan Babu) క్షమాపణలు చెప్పారు. ‘అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని ఓ లేఖలో పేర్కొన్నారు. 'నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారుతుందని అనుకోలేదు. తీవ్ర ఆందోళన కారణంగా నేను టీవీ9 జర్నలిస్టులను ఆవేదనకు గురి చేసినందుకు చింతిస్తున్నాను. ఆ తర్వాత నా ఆరోగ్యం బాగోలేని కారణంగా వెంటనే స్పందించ లేకపోయాను. 48 గంటల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. అందుకే ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టుకు గాయం అవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన కుటుంబానికి, టీవీ9 కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నా’ అని మోహన్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేసిన లేఖలో పేర్కొన్నారు.

నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now