Anasuya Bharadwaj: మగజాతి పరువు తీస్తున్నారంటూ నెటిజన్ మీద మండిపడిన అనసూయ భరద్వాజ్, మీరు ఇద్దరు పిల్లల తల్లి ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా అని నెటిజన్ ట్వీట్

నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Anasuya Bharadwaj (Photo Credits: Twitter)

అటు యాంకరింగ్‌.. ఇటు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్ నెటిజన్స్‌ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ ట్విటర్‌లో 'అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు' అంటూ అనసూయను ట్యాగ్‌ చేస్తూ కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌కు అనసూయ స్ట్రాంగ్‌గానే కౌంటర్‌ ఇచ్చింది. ఈ ట్వీట్‌ను షేర్‌ చేస్తూ 'దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)