Temple for Samantha: సమంత కోసం గుడి కడుతున్న వీరాభిమాని, సమంత వ్యాధి నుంచి కోలుకున్నందుకు మొక్కుబడి యాత్ర కూడా పూర్తి
ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంత బర్త్‌డేకు వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వనున్నాడు.
గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్ సమంతకు ఫ్యాన్ గుడి కట్టిస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంత బర్త్‌డేకు వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వనున్నాడు. తన ఇంటిలోనే సమంత విగ్రహం తయారు చేయించి గుడి కడుతున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది.
సమంత వ్యాధి నుంచి కోలుకున్నందుకు ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గాకు మొక్కుబడి యాత్ర కూడా నిర్వహించినట్లు సందీప్ తెలిపారు. ఈనెల 28న సమంత పుట్టినరోజు సందర్భంగా గుడి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓ వీరాభిమాని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కూడా ఇలాగే గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)