Oscars 2023: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండా రెపరెపలాడింది, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ‘ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది.

RRR

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ‘ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్‌ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది’ అని సీఎం జగన్ ట్వీట్‌ చేశారు.

కాగా, భారత్‌ నుంచి మూడు విభాగాల్లో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌కు నామినేషన్స్‌ దక్కాయి. వీటీలో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ విభాగం నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటునాటు’ పాట, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ గెలుచుకున్నాయి.

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now