Aryan Khan Drug Case: షారూక్ ఖాన్, బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంటికి ఎన్సీబీ అధికారులు, విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ షారూక్ నివాసం మన్నత్ వద్దకు ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వెళ్లారు. డ్రగ్స్ కేసులో షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆర్డర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్‌ను ఇవాళ షారూక్ వెళ్లి కలిసాడు.
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ షారూక్ నివాసం మన్నత్ వద్దకు ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వెళ్లారు. డ్రగ్స్ కేసులో షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆర్డర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్‌ను ఇవాళ షారూక్ వెళ్లి కలిసాడు. కొడుకును కలుసుకుని ఇంటికి వచ్చిన తర్వాత.. షారూక్ నివాసానికి ఎన్సీబీ అధికారులు వెళ్లారు. క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో.. ఆర్మన్ దొరికాడు. అయితే ఈ కేసులో ఆర్యన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంటికి కూడా ఎన్సీబీ అధికారులు వెళ్లారు. ఆమెకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ ఎన్సీబీ అధికారులు ఆదేశించారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్‌కు రెండుసార్లు బెయిల్ తిరస్కరించారు. అక్టోబర్ 26వ తేదీన బాంబే హై కోర్టు ఈ కేసును విచారించనున్నది. అప్పటి వరకు ఆర్యన్ జైలులోనే ఉండనున్నాడు. ఆర్యన్ వాట్సాప్ ఛాట్‌లో అనన్య పాండే పేరు ఉన్న నేపథ్యంలో ఆమెను కూడా ఎన్సీబీ విచారించనున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)