Bandla Ganesh COVID: మూడోసారి బండ్ల గణేశ్‌కు కరోనా, స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపిన టాలీవుడ్ నిర్మాత

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు మూడో సారి కరోనా సోకింది. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. రెండోసారి కరోనా సోకడంతో బండ్ల గణేశ్ కు ఆసుపత్రిలో బెడ్ దొరకడం చాలా కష్టమైంది. మెగాస్టార్ చిరంజీవి మాట చలవతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు.

Bandla Ganesh (Photo-Twitter)

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు మూడో సారి కరోనా సోకింది. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. రెండోసారి కరోనా సోకడంతో బండ్ల గణేశ్ కు ఆసుపత్రిలో బెడ్ దొరకడం చాలా కష్టమైంది. మెగాస్టార్ చిరంజీవి మాట చలవతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. అయితే, గత మూడ్రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, ఈ సాయంత్రం కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని బండ్ల గణేశ్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement