Bharateeyudu 2 First Song: గూస్ బంప్స్ తెప్పిస్తున్న భారతీయుడు 2 శౌర సాంగ్, జులై 12న సరికొత్త రికార్డు సెట్ చేసేందుకు రెడీ అవుతున్న మూవీ
స్టార్ హీరె కమల్ హాసన్ .. దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది.
స్టార్ హీరో కమల్ హాసన్ .. దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ రోజు మేకర్స్ ‘భారతీయుడు 2’ మూవీ నుంచి ‘శౌర..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇండియన్-2 నుంచి పారా ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది, రేపు సాయంత్రం 5 గంటలకు పుల్ సాంగ్ విడుదల
పాటలో చూపించిన కొన్ని విజువల్స్ చూస్తుంటే 'భారతీయుడు 2' అంచనాలను మించేలా శంకర్ తెరకెక్కించారని స్పష్టమవుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను రితేష్ జి.రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1996లో కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందుతోంది.
Here's Song
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)