Devara New Poster: దేవర నుంచి సెకండ్ పోస్టర్ వచ్చేసింది, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ లుక్ విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి సినిమా
సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విలన్ లుక్ బయటపెట్టారు.తాజాగా సైఫ్ అలీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు
జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విలన్ లుక్ బయటపెట్టారు.తాజాగా సైఫ్ అలీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే సైఫ్ అలీ ఖాన్.. 'భైరా' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. లుక్ అది చూస్తుంటే పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకొస్తామని ప్రకటించారు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. దీంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలానే 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల కసితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలానే సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఇలా చాలా అంశాలు దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి.
Here's Tarak Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)