Heeramandi Trailer Out: హీరామండి: ది డైమండ్ బజార్ ట్రైలర్ ఇదిగో, మే 01 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో భన్సాలీ వెబ్ సిరీస్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ డైరక్టర్

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar) ట్రైల‌ర్ ను మేకర్స్ విడుద‌ల చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు

Heeramandi The Diamond Bazaar Trailer

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar) ట్రైల‌ర్ ను మేకర్స్ విడుద‌ల చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ మే 01 నుంచి అందుబాటులోకి రానుంది.ఈ సిరీస్‌తోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి  భన్సాలీ అడుగు పెడుతున్నారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భీమా స్ట్రీమింగ్, నాలుగు భాషల్లో ఓటీటీలో విడుదల కానున్న గోపిచంద్ మూవీ

ఈ చిత్రానికి భన్సాలీతో పాటు విభు పూరి, మితాక్షర కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా. ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇండిపెండెన్స్‌కు ముందు పాకిస్తాన్ లాహోర్‌లోని హీరామండి అనే ప్రాంతాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాలా) పరిపాలిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతాన్ని త‌మ గుప్ప‌ట్లోకి తెచ్చుకోవాల‌ని బ్రిటీష్ వాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారనేది వెబ్ సిరీస్.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now