Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సడన్ గా కుటుంబంతో కలిసి దుబాయ్ లో అడుగు పెట్టారు. అక్కడ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Allu Arjun Wax Statue in Dubai

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సడన్ గా కుటుంబంతో కలిసి దుబాయ్ లో అడుగు పెట్టారు. అక్కడ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మార్చి 28వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బన్నీ దుబాయ్ వెళ్లారు. ఈ నెల 28న రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.

ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే! కానీ ఇవి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. అల్లు అర్జున్‌ విగ్రహం మాత్రం దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. బన్నీకి మాత్రమే దక్కడం విశేషం. పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తర్వాత ఈ విశేష గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now