Manchu Manoj Adipurush: అనాథ పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూయించిన మంచు మనోజ్.. నెటిజన్స్ ప్రశంసలు
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది.
Hyderabad, June 17: ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన హీరో ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ (Positive talk) వచ్చింది. బాలీవుడ్ (Bollywood) దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా అభిమానుల కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల టికెట్స్, అభిషేక్ అగర్వాల్ 10వేల టికెట్స్, టీ సిరీస్ ఏకంగా 12 వేల టికెట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలాగే మంచు మనోజ్ కూడా అనాథ పిల్లల కోసం 2500 టికెట్స్ ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఆదిపురుష్ సినిమా టికెట్స్ 2500 కొనుగోలు చేసి అనాథ పిల్లలకు అందించారు. నిన్న సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఆ పిల్లలతో కలిసి సినిమా చూశారు కూడా. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ హీరో మంచి మనసుకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)