Nithiin Wife Shalini's Birthday: ప్రేమంటే ఇదే మరి.. భార్యకు కరోనా, అయినా పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించి ఆశ్చర్యపరిచిన హీరో నితిన్
యంగ్ హీరో నితిన్ భార్య శాలిని కరోనా బారిన పడిన విషయం విదితమే. అయితే నేడు ఆమె పుట్టిన రోజు. భార్యకు కరోనా సోకినప్పటికి నితిన్ తన భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. భార్య బర్త్‌డే వినూత్నంగా సెలబ్రేట్ చేసిన నితిన్ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ భార్యపై ప్రేమ కురిపించాడు
యంగ్ హీరో నితిన్ భార్య శాలిని కరోనా బారిన పడిన విషయం విదితమే. అయితే నేడు ఆమె పుట్టిన రోజు. భార్యకు కరోనా సోకినప్పటికి నితిన్ తన భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. భార్య బర్త్‌డే వినూత్నంగా సెలబ్రేట్ చేసిన నితిన్ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ భార్యపై ప్రేమ కురిపించాడు. ‘కోవిడ్‌కి సరిహద్దులు ఉన్నాయేమో, మన ప్రేమకి సరిహద్దులు లేవు, హ్యాపీ బర్త్ డే టు మై లవ్. లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తన వైఫ్‌కు కరోనా రావడంతో వాళ్ళ ఇంట్లో పైన ఒక రూమ్‌లో ఆమె ఐసోలేషన్‌లో ఉంది. దీంతో ఆమె కిటికి లోంచి చూస్తూ ఉంటే కింద గార్డెన్ ఏరియాలో నితిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి విషెష్ తెలియచేశాడు. కింద నుంచే కేక్ చూపించి తిను అన్నట్లు చెప్పాడు నితిన్. ఇలా దూరం దూరంగా ఉండి నితిన్ తన వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)