HCA Awards 2023: జూనియర్ ఎన్టీఆర్‌కు రెండు హెచ్సీఏ అవార్డులు, స్పాట్ లైట్ అవార్డ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్న తారక్

హెచ్సీఏ అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ కు కూడా అవార్డులు ఉన్నాయని హెచ్సీఏ ప్రకటించింది.

Junior NTR (Photo-Twitter)

HCA అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ కు కూడా అవార్డులు ఉన్నాయని హెచ్సీఏ ప్రకటించింది. తన సినిమా షూటింగ్ బిజీ వల్ల ఆయన అమెరికాకు రాలేకపోయినట్టు తమకు తెలిపారని వెల్లడించింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన అవార్డుల ట్రోఫీలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను స్పాట్ లైట్ అవార్డ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు తారక్ వచ్చినట్టు తెలిపింది. స్పాట్ లైట్ అవార్డును అలియా భట్ కు కూడా హెచ్సీఏ ప్రకటించింది. 'డియర్ ఆర్ఆర్ఆర్ సపోర్టర్స్ అండ్ ఫ్యాన్స్... జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ లకు వచ్చిన అవార్డులను మీతో పంచుకుంటున్నాం. వచ్చే వారం ఈ అవార్డులను వారికి పంపిస్తున్నాం' అని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.

Here's HCA Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now