James Cameron Praises Rajamouli: రాజమౌళిపై హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ మళ్లీ ప్రశంసలు, భారతీయ సినిమా ప్రపంచ వేదికపై నిలిచిందంటే..
ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు.నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ద్వారా పంచుకుంది
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి..బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న సంగతి విదితమే. గతేడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్‌ను గెలిచి భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపారు. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభించింది.
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రాజమౌళిపై ప్రశంసల వర్షం (James Cameron Praises Rajamouli) కురిపించారు. తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజం మరోసారి రాజమౌళిని పొగిడారు. ఈవెంట్‌లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు.నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ద్వారా పంచుకుంది. 'మీ అమూల్యమైన మాటలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టి మరింత ఎత్తుకు ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.' అంటూ ట్వీట్ చేసింది.
Here's RRR Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)