Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ వేశారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో థర్మాకోల్ అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది.
Hyderabad, May 29: పవర్ స్టార్ (Power star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ (Shooting set) లో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ వేశారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో థర్మాకోల్ అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)