Yarta 2 First Look: ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అంటూ యాత్ర 2 మూవీ ఫస్ట్ లుక్ ఇదిగో, ఈ నెల 5వ తేదీన టీజ‌ర్‌ను విడుదల చేయనున్న మేకర్స్

తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది యూనిట్‌

Yatra 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. మహి వి రాఘవ్‌ (Mahi V Raghav) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యం సాధించింది. మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ పాత్ర‌లో న‌టించి అల‌రించాడు. ఇక ఈ సూపర్‌ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌గా యాత్ర 2 తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది.

వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది. ఈ చిత్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. యాత్ర 2 టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 05న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించింది. తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది యూనిట్‌

Here's First look



సంబంధిత వార్తలు

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు