Jr NTR-Ram Charan: మరికొద్దిసేపట్లో ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. బాబును కలువనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు
ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు.
Vijayawada, Sep 13: స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR-Ram Charan) నేడు ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) నాయుడును కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు. అనంతరం చంద్రబాబుతో భేటీ అవుతారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎంల పిలుపుమేరకు ఆయా రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు 50 లక్షలు చొప్పున సాయం ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ విరాళం అందించేందుకు నేడు ఏపీ సచివాలయానికి రానున్నారు. ఇదిలాఉంటే.. టీడీపీ, తారక్ మధ్య కొన్నేళ్లుగా గ్యాప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటీ కానుండడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)