Sarkaru Vaari Paata: సర్కార్‌ వారి పాటకే కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్, టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ

ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు.

Mahesh Babu Sarkaru Vaari Paata (Photo-Twitter)

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘సర్కార్‌ వారి పాట’సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. టికెట్‌ రేట్ల విషయానికొస్తే మల్టిప్లెక్స్, రిక్లైనర్, లార్జ్‌ స్క్రీన్‌ ఐమ్యాక్స్‌ వంటి థియేటర్లలో టికెట్‌పై రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అనుమతించినట్టు తెలిపారు. మిగిలిన నాన్‌ ఏసీ థియేటర్లలో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు