Vishwak Sen's Laila: పృథ్వీ రాజ్ వ్యాఖ్యలపై సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైలా హ్యాష్‌ట్యాగ్
విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రేమికుల దినోత్సవం నాడు థియేటర్లలో విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆన్‌లైన్‌లో విడుదలైనప్పటి నుండి వివాదాలతో చుట్టుముట్టబడింది. "30 ఇయర్స్ ఇండస్ట్రీ" ట్యాగ్ తో పేరుగాంచిన నటుడు పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో, లైలాలో తన పాత్ర గురించి చర్చిస్తూ పరోక్షంగా ఒక రాజకీయ పార్టీని విమర్శించారు.
అతని వ్యాఖ్యలు త్వరగా వైరల్ అయ్యాయి. దీంతో మూవీ టీం అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పింది. ఆ వ్యాఖ్యలకు సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది, దయచేసి సినిమాని బతికించాలని మూవీ టీం కోరింది. కాగా పృథ్వీ రాజ్ వ్యాఖ్యలపై ఓ రాజకీయ పార్టీ మద్దతుదారులు X (గతంలో ట్విట్టర్)లో “బాయ్‌కాట్ లైలా” అనే ట్రెండ్‌ను ప్రారంభించడం ద్వారా వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోశారు. ఈ పెరుగుతున్న వివాదం సినిమా బాక్సాఫీస్ పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Laila Movie Team Says Sorry on Prudhvi Raj’s remarks spark political controversy
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)