Sarkaru Vaari Paata: 24 గంటలు గడవక ముందే 25 మిలియన్​ వ్యూస్​, యూట్యూబ్​ను షేక్ చేస్తోన్న సర్కారు వారి పాట ట్రైలర్, నెంబర్​ వన్​ స్థానంలో ట్రెండ్

ప్రస్తుతం ఈ ట్రైలర్​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ 19 గంటల్లో అంటే 24 గంటలు గడవక ముందే 25 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసింది.

Sarkaru Vaari Paata New Poster

సూపర్​ స్టార్ మహేశ్​ బాబు, మహానటి కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్​గా సముద్ర ఖని అలరించనున్నారు. మే 12న ఈ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్​లో స్పీడు పెంచిన చిత్ర యూనిట్ మే 2న ట్రైలర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ 19 గంటల్లో అంటే 24 గంటలు గడవక ముందే 25 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసింది.

ఈ వ్యూస్​తోపాటు ఒక మిలియన్​ లైక్స్​ కూడా సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్​ యూట్యూబ్​లో నెంబర్​ వన్​ స్థానంలో ట్రెండ్​ అవుతోంది. ఇప్పుడే ఇన్ని లైక్స్​, వ్యూస్​ సాధించిన ఈ ప్రచార చిత్రం 24 గంటలు గడిస్తే మరెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి. ఈ ట్రైలర్​లో మహేశ్ బాబు లుక్స్​, డైలాగ్స్​ సూపర్బ్​గా ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇదివరకు విడుదలైన పెన్నీ, కళావతి పాటలు, టీజర్​ విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement