Jaison Joseph Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన ప్రముఖ మాలీవుడ్ నిర్మాత జైసన్​ జోసెఫ్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మాలీవుడ్‌ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.​ ప్రముఖ నిర్మాత జైసన్​ జోసెఫ్ కొచ్చిలోని​ తన అపార్ట్‌మెంట్‌లోనే శవమై కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Representational Image (Photo Credits: ANI)

మాలీవుడ్‌ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.​ ప్రముఖ నిర్మాత జైసన్​ జోసెఫ్ కొచ్చిలోని​ తన అపార్ట్‌మెంట్‌లోనే శవమై కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతి పట్ల మాలీవుడ్​ హీరోలు, నటులు, నిర్మాతలు, దర్శకులు సంతాపం తెలుపుతున్నారు.

చిన్నవయసులోనే ఆయనను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కుంచాకో బోబన్ నటించిన 'జమ్నా ప్యారీ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి థామస్ కె సెబాస్టియన్ దర్శకత్వం వహించారు. కుంచాకో బోబన్, గాయత్రి సురేష్, నీరజ్ మాధవ్ ఈ సినిమాలో నటించారు. గిరీష్ మనో దర్శకత్వంలో 2017లో విడుదలైన బిజు మీనన్ నటించిన ‘లవకుశ’ చిత్రాన్ని కూడా జైసన్ జోసెఫ్ నిర్మించారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement