Mangli Emotional Message: కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు, ఉద్వేగానికి లోనైన సింగర్ మంగ్లీ, ఈ జీవితానికి ఇంకేం కావాలి? సదా మీ ప్రేమను కోరుకునే.. మీ మంగ్లీ అంటూ ట్వీట్

ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.కొన్ని కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు అతికించి కన్నడిగులు అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Mangli Emotional Message (Photo-Instagram)

ఈ ఫొటోలు మంగ్లీ కంట పడ్డాయి. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మంగ్లీ ఉద్వేగానికి లోనైంది. కన్నడిగులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైంది. ఈ జీవితానికి ఇంకేం కావాలి? సదా మీ ప్రేమను కోరుకునే.. మీ మంగ్లీ.." అంటూ చేతులు జోడించి క్యాప్షన్‌ ఇచ్చింది.

అల్లు అర్జున్‌ సినిమాలో 'రాములో రాములా..' పాటతో పాటు 'సారంగదరియా..' పాటతో ప్రేక్షకజనాన్ని ఉర్రూతలూగించింది. ఆకాశవాణిలో 'మనకోన..' అంటూ మట్టివాసన గొప్పదనాన్ని పాట ద్వారా జనాలకు అందించింది. తెలుగులోనే కాకుండా కన్నడ 'రాబర్ట్‌' చిత్రంతో అక్కడి ప్రేక్షకులకు కూడా చేరువయ్యింది. ఆమె సాంగ్‌ ఎంత హిట్టయ్యిందో, ఆమె పాపులారిటీ కూడా అంతకు రెట్టింపైంది.

 

View this post on Instagram

 

A post shared by Mangli Singer (@iammangli)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)