Chiranjeevi: సుకుమార్ డైరెక్షన్‌లో చిరంజీవి, శుభగృహ రియల్ ఎస్టేట్ యాడ్ ఫిల్మ్‌లో నటించిన మెగాస్టార్
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి స్టార్ (Chiranjeevi) డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో పనిచేయనున్నట్టు ఓ అప్డేట్ ఇప్పటికే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన యాడ్ ఫిల్మ్ లో నటించాడు చిరు.
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి స్టార్ (Chiranjeevi) డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో పనిచేయనున్నట్టు ఓ అప్డేట్ ఇప్పటికే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన యాడ్ ఫిల్మ్ లో నటించాడు చిరు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. యాడ్ ఫిల్మ్ షూటింగ్ లొకేషన్‌లో దిగిన ఫొటోలను అందరితో పంచుకున్నాడు. సుకుమార్ టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రతీ ఒక్కరికి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను. యాడ్‌ను నిర్మిస్తున్న శుభగృహ రియల్ ఎస్టేట్ (Subhagruha real estate company) కంపెనీకి ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు చిరు. ఈ యాడ్‌లో చిరంజీవి ఎప్పుడూ కనిపించని విధంగా ఫార్మల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)