Nandini Rai Dance: డెడ్ బాడీ ముందు డ్యాన్స్‌తో అదరగొట్టిన నందినిరాయ్, జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు స్టెప్పులు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఫూటింగ్ మధ్యలో ఘటన, విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
అందులో పాత చీర కట్టుకున్న నందినీ తమిళ్ హీరో ధనుష్ 'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు వీర లెవల్లో స్టెప్పులేసింది
తెలుగు నటి నందినీ రాయ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో షూటింగ్ మధ్యలో చేసిన అల్లరి పనులకు సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. అందులో పాత చీర కట్టుకున్న నందినీ తమిళ్ హీరో ధనుష్ 'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు వీర లెవల్లో స్టెప్పులేసింది. ఓ శవం ముందు డ్యాన్స్ చేసింది! అయితే అక్కడ నిజంగా ఎవరూ చనిపోలేదు, కేవలం అది షూటింగ్‌లో భాగంగా వేసిన సెట్. కానీ చాలామంది నెటిజన్లకు ఈ ఐడియా నచ్చనేలేదు. దీంతో కొందరు ఆమెను సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. డెడ్ బాడీ ముందు డ్యాన్స్ ఏంటి?, అది కేవలం సెట్టే కావచ్చు, అయినా అక్కడ అలా డ్యాన్స్ చేయడం ఏమీ బాగోలేదు అంటూ పెదవి విరుస్తున్నారు. మరికొందరు మాత్రం డ్యాన్స్ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)