Prathinidhi 2 Trailer Out: నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ ఇదిగో, రాజకీయాలపై ప్రశ్నలు సంధించే జర్నలిస్ట్ పాత్ర‌లో అలరించినున్న టాలీవుడ్ హీరో

తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తున్న సంగతి విదితమే. సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Prathinidhi 2 Trailer Out

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తున్న సంగతి విదితమే. సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.ట్రైల‌ర్ చూస్తే.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ రానున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నారా రోహిత్ సమకాలీన రాజకీయాలపై ప్రశ్నలు సంధించే జర్నలిస్ట్ పాత్ర‌లో అల‌రించ‌నున్నాడు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ & రానా ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోలో, ప్రతినిధి, రౌడీ ఫేల్లో, అసుర వంటి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీసి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్..చివరి సారిగా 5ఏళ్ల కిందట వీర భోగ వసంత రాయలు సినిమాలో కనిపించాడు.

Here's Trailer

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)