Oscars 2023: వీడియో ఇదిగో..తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో సంగీతం ధ్వనిస్తుంది, ఆస్కార్ వేదికపై తెలుగు గొప్పతనాన్ని మాటలతో వివరించిన చంద్రబోస్
ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR Movie ) చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు( Oscars 2023 )ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డు అందుకుంది. ఇంత గొప్ప పాట ఎలా రాశారని మీడియా అడిగిన ప్రశ్నకు పాటల రచయిత చంద్రబోస్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR Movie ) చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు( Oscars 2023 )ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డు అందుకుంది. ఇంత గొప్ప పాట ఎలా రాశారని మీడియా అడిగిన ప్రశ్నకు పాటల రచయిత చంద్రబోస్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. తెలుగులో 56 అక్షరాలు ఉంటాయని తెలిపారు.
తెలుగు భాషలో చాలా అక్షరాలు, చాలా ఫీలింగ్స్, చాలా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయని.. అందుకే ఇది గొప్ప భాష అని చెప్పారు. తెలుగు సాహిత్య భాష.. సంగీత భాష అని ఆయన స్పష్టం చేశారు. తెలుగులో మామూలు ఒక్క పదం రాసినా కూడా అందులో సంగీతం ప్రతిధ్వనిస్తోందని తెలిపారు. తెలుగు వాళ్లకు సాహిత్యం అర్థమవుతుంది కాబట్టి ఇష్టపడతారు.. కానీ భాషతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతున్నారంటే దానికి ఆ పాటలోని పదాల వెనుక ఉన్న సంగీతమే కారణమని స్పష్టం చేశారు.
Here's Video