Major Movie: మేజర్ మూవీ చూస్తానంటూ.. టీంకి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్, థాంక్యూ పవన్ కల్యాణ్ అంటూ మహేశ్ బాబు రిప్లయి ట్వీట్
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరో అడివి శేష్ స్పందించారు. "థాంక్యూ పవన్ కల్యాణ్" అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు
ఇటీవల విడుదలైన మేజర్ చిత్రం గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరో అడివి శేష్ స్పందించారు. "థాంక్యూ పవన్ కల్యాణ్" అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. "మీ స్పందనతో మేజర్ టీమ్ నిజంగా ఆనందంతో పొంగిపోతోంది" అని పేర్కొన్నారు.
అడివి శేష్ కూడా ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. "డియర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్... నా హృదయం ఆనందంతో నిండిపోయింది. టూర్ బిజీగా ఉండేసరికి మీకు మేజర్ సినిమా చూసే టైమ్ ఉంటుందా అని అనుకున్నా. కానీ మీరు వ్యక్తిగతంగా ఎంతో హృదయపూర్వకంగా రాసిన లేఖ నిజంగా మనసును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ను నా సర్వస్వంగా భావిస్తాను. ఆ రోజు పంజా, ఇవాళ మేజర్. మీ అభిమానానికి ధన్యుడ్ని" అంటూ అడివి శేష్ పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)