Prabhas First Look in Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల
మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు.'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది.
మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు.'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ సినిమాను సొంత బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటిస్తున్నారు.కాజల్ (Kajal) పార్వతీదేవిగా కనిపిస్తున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Prabhas First Look in Kannappa:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)