The Raja Saab First Look: సంక్రాంతి సినీ సందడి షురూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల.. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని మాస్ అవతార్ లో డార్లింగ్ హల్ చల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ సంక్రాంతి రోజున అదిరిపోయే మాస్ సర్ ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరుని ‘ది రాజా సాబ్’గా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Hyderabad, Jan 15: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కు పెద్ద పండుగ సంక్రాంతి (Pongal) రోజున అదిరిపోయే మాస్ సర్ ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరుని ‘ది రాజా సాబ్’(The Raja Saab)గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది. ‘ఎక్స్’ వేదికగా ఫస్ట్ లుక్ ను డైరెక్టర్ మారుతీ ప్రకటించారు. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని ప్రభాస్ ఎనర్జిటిక్ గా మాస్ అవతార్ లో కనిపించడంతో ఈ ఫస్ట్ లుక్ ని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘ది రాజా సాబ్’ సినిమా హార్రర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)