
Hyderabad, Jan 15: తెలుగు వాళ్ళు (Telugu People) అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి (Pongal). అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ అనగానే మనకందరికీ గుర్తొచ్చేవి ముత్యాల ముగ్గులు, ముంగిట గొబ్బిళ్లు, హరిదాసుల పాటలు, బసవన్నల ఆటలు, ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు, సందడి చేసే బంధువులు. అటువంటి సంక్రాంతి పండుగ నేడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుగుతుంది. నేటి నుండి సూర్య భగవానుడు ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తాడు. సూర్యుడు సంక్రాంతి రోజున మకర రాశిలోకి ప్రవేశించింది మొదలు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. నెల రోజులపాటు కొనసాగిన ధనుర్మాస ముగింపును గుర్తు చేస్తూ మకర సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ పర్వదినం సందర్భంగా మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ అందించే గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా విషెస్ తెలియజేయండి.









