Pushpa 2 Latest Update: పుష్ప ది రూల్‌ తొలి పాట ప్రోమో లాంచ్ తేదీ ఇదిగో, ఫుల్‌ లిరికల్ వీడియో సాంగ్‌ తేదీని కూడా రేపు ప్రకటించనున్న మేకర్స్

పుష్ప ది రూల్‌ ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. దీంతోపాటు ఫుల్‌ లిరికల్ వీడియో సాంగ్‌ తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Pushpa 3 Is Pushpa The Roar

Pushpa Pushpa Lyrical Promo Date: పుష్ప ది రూల్‌ తొలి పాట లాంఛ్‌కు రెడీ అయింది. పుష్ప ది రూల్‌ ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. దీంతోపాటు ఫుల్‌ లిరికల్ వీడియో సాంగ్‌ తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

టీజర్‌ యూట్యూబ్‌లో 138 వాచింగ్‌ హవర్స్‌లో 110 మిలియన్‌ వ్యూస్‌, 1.55 మిలియన్‌ లైక్స్‌తో సోషల్ మీడియాలో నంబర్ 1 స్థానంలో టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచి.. సెన్సేషనల్‌ రికార్డు సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. పుష్ప ది రూల్‌ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ భూషణ్‌ కుమార్‌ టీ సిరీస్‌ దక్కించుకుంది.

ఈ మూవీ ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోండగా.. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)