Seetimaarr Official Trailer: గోపీచంద్ సీటీమార్‌ ట్రైలర్ విడుదల, రూల్స్‌ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు, రూట్‌ లభించి ఆలోచించి పంపిస్తే పేపర్‌లో వస్తారు' అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలు

టాలీవుడ్ హీరో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా నటించిన చిత్రం 'సీటీమార్‌'. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. భూమిక, సూర్యవంశీ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది.

Seetimaarr Official Trailer

టాలీవుడ్ హీరో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా నటించిన చిత్రం 'సీటీమార్‌'. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. భూమిక, సూర్యవంశీ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ఒక ఊరి నుంచి 8 కబడ్డీ ఆటగాళ్లను పంపించడం కుదరదు అని ఓ వ్యక్తి అడ్డు చెపుతుండగా.. 'రూల్స్‌ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు, రూట్‌ లభించి ఆలోచించి పంపిస్తే పేపర్‌లో వస్తారు' అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. 'మన దేశంలో మగాళ్లు కనీసం అరవయ్యేళ్లు బతికి చచ్చిపోతున్నారు, ఆడాళ్లు కూడా అరవయ్యేళ్లు బతుకుతున్నారు.. కానీ 20 ఏళ్లకే చచ్చిపోతున్నారు..' అని చెప్పే డైలాగ్‌ జనాలకు కనెక్ట్‌ అవుతుంది. సెప్టెంబర్‌ 10 న సినిమా విడుదల కానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement