Director Sarath Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూత, క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన దిగ్గజ దర్శకుడు
తెలుగు చిత్ర సీమ ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రేపు(శనివారం)మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంసభ్యులు తెలిపారు
తెలుగు చిత్ర సీమ ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రేపు(శనివారం)మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంసభ్యులు తెలిపారు. 'డియర్' అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన తెలుగులో సుమారు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు.
బాలకృష్ణతో `వంశాని కొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు` సినిమాలు తీశాడు. సుమన్ తో `చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు` సినిమాలు తెరకెక్కించారు. కాగా శరత్ మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)