Samantha Ruth Prabhu: నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరంటున్న సమంత, కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని డాక్టర్ మంజుల గురించి ట్వీట్
నీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను.
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత(Samantha) ఎక్కువ సమయం తన స్నేహితులతోనే గడుపుతోంది. ఇటీవల ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి పుణ్యస్థలాలను దర్శించుకుంది. తాజాగా సమంత (Samantha Ruth Prabhu) తన స్నేహితురాలు డాక్టర్ మంజుల అనగాని పుట్టిన రోజు వేడుకకి హాజరైంది. ఈ పార్టీకి సమంతతో పాటు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మంజుల గురించి ఆసక్తికరపోస్ట్ (Samantha shares emotional post) పెట్టింది.
నీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే’అని కామెంట్ చేసింది. కాగా డాక్టర్ మంజుల ఓ ప్రముఖ గైనకాలజిస్ట్. పద్మశ్రీ అవార్డు గ్రహిత కూడా. మల్టీటాలెంటెడ్ అయిన మంజుల వైద్యంతో పాటు పలు రంగాల్లో రాణిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)