Superstar Krishna Turns 78: డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, మీకు తెలియనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను నాన్న అంటూ కొడుకు మహేష్ బాబు ట్వీట్

తెలుగు చిత్రసీమలో సూపర్‌ స్టార్‌ కృష్ణ నేడు(సోమవారం)78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Superstar Krishna Turns 78 (Photo-Twitter/Mahesh Bbau)

'హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీకు తెలియనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను నాన్న' అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్‌ చేశారు. నిజానికి మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’ నుంచి టీజర్‌ను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. కొవిడ్ కార‌ణంగా అభిమానులు, స‌న్నిహితులు కృష్ణ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేదు. సోష‌ల్ మీడియాలోనే ఆయ‌న‌కు పుట్టిన‌రోజు అభినంద‌నలు తెలియ‌జేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement