Rajinikanth: ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ప్రకటించని తలైవా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును ఉదయమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గ పరిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో రజనీకాంత్ ఓటేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రజనీకాంత్.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో రజనీకాంత్ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఇక ఇటీవలే కేంద్రం రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రజనీకాంత్.. ఓటర్లను కోరారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)