Rajinikanth Visits Kedarnath: కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించిన రజినీకాంత్, ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని వెల్లడి
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం శ్రీ కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించారు. ఏటా హిమాలయాలను సందర్శించే రజనీకాంత్ మరోసారి యాత్ర బాట పట్టారు. అంతకుముందు చెన్నై నుంచి డెహ్రాడూన్‌కు చేరుకున్న సూపర్ స్టార్ డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నేడు కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించారు. ఏటా హిమాలయాలను సందర్శించే రజనీకాంత్ మరోసారి యాత్ర బాట పట్టారు. అంతకుముందు చెన్నై నుంచి డెహ్రాడూన్‌కు చేరుకున్న సూపర్ స్టార్ డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు. మనిషి జీవితంలో ఆధ్యాత్మిక యాత్ర చాలా ముఖ్యం. ఏటా నేను హిమాలయాలకు వెళ్తుంటా. వెళ్లిన ప్రతిసారీ కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ సారి కూడా కొత్త అనుభవాలు పొందుతానని నేను నమ్ముతున్నాను’ అని రజనీకాంత్ అన్నారు. ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని ఈ సందర్భంగా సూపర్ స్టార్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. ఒక్క రోజే 10 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్, ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేసుకోండి
Here's Pics
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)