CM Chandrababu Naidu Visits Krishna District's Agricultural Centers (Photo-X/TDP)

Vjy, Dec 20: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఉన్నారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమశాతం నిర్ధరణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హెచ్చరించారు. సీఎం మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్‌ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు.

CM Chandrababu Naidu Visits Krishna District's Agricultural Centers

అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్‌ కాదని పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్‌మెంట్‌ కనిపించాలని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. తేమ శాతం, ఇతరత్రా అంశాల్లో కచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. రైతులకు ఐవీఆర్‌ఎస్‌పై స్వయంగా అవగాహన కల్పించారు.. దాని ద్వారా ఫీడ్‌బ్యాక్‌ పంపాలని సూచించారు.