చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సందర్శించారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సమీపంలో గల చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సినీ యాంకర్ ప్రియాంక చోప్రా సందర్శించడంతో ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా చోప్రా పంచుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
హైదరాబాద్ లో తనకు సహాయ సహకారాలు అందించిన ఉపాసనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. దీనికి రిప్లయ్ ఇస్తూ, కొత్త సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ ఉపాసన స్పందించింది. ప్రియాంక చోప్రా పోస్ట్, ఉపాసన రిప్లయ్ తో మహేష్-రాజమౌళి ప్రాజెక్టులోకి ప్రియాంక చోప్రా వచ్చి చేరిందనే విషయం దాదాపు పక్కా అయింది.
Priyanka Chopra Visits Chilkur Balaji Temple:
హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించిన నటి ప్రియాంకా చోప్రా
బాలాజీ ఆశీర్వాదంతో.. సరికొత్త అధ్యాయం మొదలైందంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు
SSMB29లో ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తోందని ప్రచారం జరుగుతున్న తరుణంలో..
ఆమె చిలుకూరి బాలాజీకి రావడంపై సంతరించుకున్న… pic.twitter.com/fkrzNLMsqR
— Pulse News (@PulseNewsTelugu) January 21, 2025
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంక చోప్రా pic.twitter.com/pJEw9Bnyeq
— BIG TV Breaking News (@bigtvtelugu) January 21, 2025
ఇక అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం.నిజానికి మహేష్ బాబు, రాజమౌళి సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆమధ్య పూజా కార్యక్రమాలు జరిగినట్టు ప్రచారం జరిగినప్పటికీ, రాజమౌళి నోరు విప్పలేదు. ప్రాజెక్టునే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు