ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy Parankusham) తెలంగాణ ఉమెన్ కమిషన్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య (Nagachaitanya), శోభిత ధూళిపాల (Shobitha Dhulipalla) వివాహం సందర్భంగా ఓ చానల్‌లో ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి ఆ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిమ్ జర్నలిస్టుల యూనియన్ సభ్యులు (Telangana Women's Commission) తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదని కలిసి వేణు పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఉమెన్ కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.

నాకు ఆత్మహత్యే శరణ్యం..ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వీడియో విడుదల..

కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణు స్వామి హైకోర్టుకు వెళ్లారు. అయితే, హైకోర్టు సైతం ఉమెన్ కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే మంగళవారం కమిషన్ ముందు హాజరయ్యారు. హీరో నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కమిషన్ ముందు తెలియజేశారు.

Venu Swamy Apologizes

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)