Gowtham Raju Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ ఎడిటర్‌ గౌతంరాజు కన్నుమూత, సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.

Gowtham Raju Passed Away (Photo-Twitter)

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల కెరియర్‌లో 800 చిత్రాలకు పైగా ఎడిటర్‌గా పనిచేసిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకూ ఎడిటర్‌గా చేశారు. ఇటీవల కాలంలో తెలుగులో ఠాగూర్, పొలిటికల్ రౌడీ, అశోక్, ఏక్ నిరంజన్, ఖైదీ నంబర్ 150, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, మిరపకాయ్ వంటి హిట్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. 15 జనవరి 1954లో మద్రాసులో గౌతంరాజు జన్మించారు. 1982లో ‘దేఖ్ఖబర్ రఖ్ నజర్’ అనే సినిమాతో ఎడిటింగ్ కెరియర్‌ను ప్రారంభించారు. ఇండస్ట్రీలో అత్యుత్తమ ఎడిటర్‌గా పేరు సంపాదించుకున్నారు. 'ఆది' సినిమా ఎడిటింగ్‌కు గాను 2002లో నంది అవార్డు అందుకున్నారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now