Aishwarya Rai: చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు వస్తాయ్.. మహారాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ గవిత్ సంచలన వ్యాఖ్యలు.. సముద్ర తీరంలో ఉండే చేపలు తినే ఐశ్వర్య అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Credits: X

Newdelhi, Aug 22: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజూ చేపలు తినేవారికి ఐశ్వర్యలాంటి సొంతమవుతాయని గవిత్ వ్యాఖ్యానించారు. నందూర్బార్ జిల్లాలో ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ‘రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా ఉంటుంది. కళ్లు మెరుస్తుంటాయి. అలాంటి వారిని చూసే వారు ఆకర్షణకు లోనవుతారు. నేను ఐశ్వర్యరాయ్ గురించి చెప్పనా? ఆమె మంగళూరులోని సముద్ర తీరంలో నివసించేది. దీంతో, రోజూ చేపలు తినేది. చేపలు తింటే అలాంటి కళ్లు మీ సొంతమవుతాయి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now