Delhi air quality continues to deteriorate(ANI)

New Delhi, NOV 17: దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. వాయు కాలుష్యం (Air Pollution) స్థాయిలు పెరగడంపై ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (GRAP)-IV’ కింద మరిన్ని నిబంధనలను సోమవారం ఉదయం 8గంటల నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. డిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7గంటల సమయానికి 457కి పెరగడం గమనార్హం. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం ఆతిశీ ప్రకటించారు. దీని ప్ర‌కారం...ఢిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా)కు ప్రవేశాన్ని నిలిపివేయాలని CAQM ఆదేశం. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌-4 డీజిల్‌ ట్రక్కులు మాత్రమే అనుమతి.

PM Modi: నైజీరియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ గౌరవం అందుకున్న విదేశీ ప్రముఖుడిగా నిలిచిన మోదీ  

ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ, బీఎస్‌-4 వాహనాలు మినహా ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్‌ వెహికల్స్‌ ప్రవేశంపై నిషేధం. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ బీఎస్‌-4 అంతకన్నా పాత డీజిల్‌ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధిస్తున్నట్లు ప్రకటన. అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదలపై ఆదేశాలు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్‌ వంతెనలు, పవర్‌ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశం.

Kailash Gehlot Resigns AAP: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్..ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్‌కు రాజీనామా చేసిన మంత్రి కైలాష్ గెహ్లాట్..ఆప్‌తో ఢిల్లీ అభివృద్ధి శూన్యమని ఫైర్  

ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సూచించగా.. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ సూచించింది. ఈ నేపథ్యంలో దిల్లీ సీఎం ఆతిశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. GRAP-4 ఆంక్షల ప్రకారం 11-12 తరగతులు మినహా మిగతా విద్యార్థులందరికీ వ్యక్తిగత తరగతులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. దీంతో స్కూళ్లన్నీ తాత్కాలికంగా మూతపడనున్నాయి.

ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కార్యాలయాలన్నీ 50శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని సిఫారసు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ ఇవ్వొచ్చని సూచన. రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలను మూసివేయడంతో పాటు సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) సూచన.