Actor Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని నరేశ్ కోరారు.
Hyderabad, July 7: సీనియర్ నటుడు నరేశ్ (Actor Naresh) మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి (Revolver) లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని (Life threat) ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు (Revolver) అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని (SP) నరేశ్ కోరారు. నిన్న పుట్టపర్తిలో ఎస్పీని కలిసిన ఆయన.. మావోయిస్టుల నుంచి తనకు ప్రాణహాని ఉండడంతో 2008లో లైసెన్స్ రివాల్వర్ తీసుకున్నట్టు తెలిపారు. మళ్లీ దానికి అనుమతి ఇవ్వాలని గతంలో కోరినా ఇవ్వలేదని, ఇప్పుడు హిందూపురంలో ఉంటున్న తనకు లైసెన్స్ రివాల్వర్‌ను తన వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అన అభ్యర్థనకు ఎస్పీ సానుకూలంగా స్పందించినట్టు నరేశ్ తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)