Prabhas In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్.. పట్టు వస్త్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు.. వీడియో ఇదిగో
తిరుపతిలో నేడు ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
Tirumala, June 6: తిరుపతిలో (Tirupati) నేడు ఆదిపురుష్ (Adipurush) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-Release Event) నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ (Prabhas) ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వాదించారు. ప్రభాస్‌ను ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అభిమాన నటుడిని చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. వీడియో ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)