Srinu Vaitla: ఎయిర్ పోర్టులో ఏడ్చేసిన దర్శకుడు శ్రీను వైట్ల, నా పెద్ద కూతురు అమెరికా వెళుతుందని భావోద్వేగ ట్వీట్, జీవితం ఓ చక్రంలాంటిదని తెలిపిన దర్శకుడు
టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ట్విట్టర్లొ ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. వీరి పెద్దకుమార్తె ఆనంది విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. దీనిపై శ్రీను వైట్ల ట్విట్టర్ లో భావోద్వేగభరితంగా స్పందించారు.అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు నా పెద్ద కూతురు అమెరికా వెళ్లింది.
టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ట్విట్టర్లొ ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. వీరి పెద్దకుమార్తె ఆనంది విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. దీనిపై శ్రీను వైట్ల ట్విట్టర్ లో భావోద్వేగభరితంగా స్పందించారు.అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు నా పెద్ద కూతురు అమెరికా వెళ్లింది. ఓ తండ్రిగా ఎంతో వేదన కలిగింది. ఇదే వయసులో నేను చెన్నై వెళుతుంటే ఆనాడు మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో ఇప్పుడు అర్థమవుతోంది.
జీవితం ఓ చక్రంలాంటిది. నా గారాలపట్టి ఆనంది తండ్రిని గర్వించేలా చేస్తుందని గట్టి నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులో కుమార్తెకు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతున్న వీడియోను శ్రీను వైట్ల పంచుకున్నారు. శ్రీను వైట్ల, కాస్ట్యూమ్ డిజైనర్ రూప దంపతులకు ముగ్గురు కుమార్తెలన్న సంగతి తెలిసిందే.
Here's Sreenu Vaitla Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)