Allu Arjun Covid: అల్లు అర్జున్‌కి కరోనా పాజిటివ్, ప్రస్తుతం ఇంటివద్దే ఐసోలేషన్‌లో ఉన్నానని ట్విట్టర్లో వెల్లడించిన బన్నీ, తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా (Allu Arjun Covid) సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని తెలిపారు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా (Allu Arjun Covid) సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని తెలిపారు. అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ప్రస్తుతం ఇంటివద్దే ఐసోలేషన్ లో ఉన్నానని బన్నీ వివరించారు. ఇటీవల తనను కలిసిన వాళ్లు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
ఇంటి వద్దే ఉంటే సురక్షితంగా ఉండండి, మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి అని అభిమానులకు పిలుపునిచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలిపారు. ప్రేమతో మీ అల్లు అర్జున్ అంటూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)