Recipe Challenge: టాలీవుడ్‌లో కొత్తగా రెసిపీ ఛాలెంజ్ వైరల్, ప్రభాస్‌కు ఫుడ్ ఛాలెంజ్ విసిరిన అనుష్క, తర్వాత రాంచరణ్‌కు ఛాలెంజ్ విసిరిన రెబల్ స్టార్, చెర్రీ ఎవరికి విసిరారంటే..

ఇందులో భాగంగా #MSMPrecipechallenge అనే సోషల్ మీడియా ఛాలెంజ్‌ను ప్రారంభించింది.దానిలో భాగంగా వినియోగదారులు తమకు ఇష్టమైన వంటకాలను షేర్ చేయమని కోరింది.

Prabhas and Anushka and Ram Charan (Photo/Insta)

హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి, తన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి యొక్క ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా #MSMPrecipechallenge అనే సోషల్ మీడియా ఛాలెంజ్‌ను ప్రారంభించింది.దానిలో భాగంగా వినియోగదారులు తమకు ఇష్టమైన వంటకాలను షేర్ చేయమని కోరింది.రెసిపీ ఛాలెంజ్ పేరుతో కొత్త ఛాలెంజ్ ను ప్రారంభించింది స్వీటీ. తనకు ఇష్టమైన చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ కు చాలెంజ్ విసిరింది. తనకు ఇష్టమైన వంటకాన్ని అందరితో పంచుకున్నానని... ఇప్పుడు ఛాలెంజ్ ను ప్రభాస్ కు విసురుతున్నానని చెప్పింది.

ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తనకు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. దాన్ని ఎలా చేయాలో పంచుకున్నాడు. తర్వాత రామ్ చరణ్ కు ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ కు చరణ్ స్పందించాడు. తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. దాని తయారీ విధానాన్ని తెలియజేశాడు. రానా దగ్గుబాటికి తదుపరి సవాల్ విసిరాడు. రేపు రిలీజ్ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ చిత్రం పెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో అనుష్క ఒక చెఫ్ పాత్రలో కనిపించనుంది.

Prabhas and Anushka and Ram Charan (Photo/Insta)

Here's Food Challenge

 

View this post on Instagram

 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

Prabhas Food Challenge

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

Here's Ram Charan Challange

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)